News June 5, 2024
నిజాంపేట: 8న చేప ప్రసాదం పంపిణీ

నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు పంపిణీదారులు తడకంటి పర్వగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శంకర్ గౌడ్, లింగాగౌడ్ తెలిపారు. ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధితో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం అందజేయడం జరుగుతుందని వివరించారు. పూర్వీకుల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నందున పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తారన్నారు.
Similar News
News November 20, 2025
నార్సింగి: పల్లె ప్రకృతి వనమా.. డంపింగ్ యార్డా?

పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు గ్రామస్థులు కోరుతున్నారు.
News November 20, 2025
MDK: చుక్కా రామయ్యకు శతవసంత శుభాకాంక్షలు: హరీష్ రావు

ప్రముఖ విద్యావేత్త ఐఐటీ రామయ్యగా పేరుపొందిన చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శతవసంత శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలో ఐఐటీ పాఠాలు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి మేథో దిక్సూచి అయిన మహోన్నతుడు ఆయన అని అన్నారు. అక్షరం ఆయుధం, నిరాడంబరత ప్రతిరూపం, క్రమశిక్షణకు మారుపేరు అయిన రామయ్య దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


