News February 16, 2025
నిజాంసాగర్: ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను, కళాశాలను ఆదివారం కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి సలాం సందర్శించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షను ఆయన పర్యవేక్షించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News December 4, 2025
తూ.గో. హ్యాండ్ బాల్ టీమ్ ఎంపిక

సామర్లకోట మండలం పనసపాడులో బుధవారం తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్బాల్ టీమ్ ఎంపిక జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో 40 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఎంపికైన ఈ జట్టు కర్నూలులో జరగనున్న అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు ఇతర క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
News December 4, 2025
భారతీయుడికి జాక్పాట్.. లాటరీలో రూ.61కోట్లు!

సౌదీలో ఉంటున్న భారతీయుడు PV రాజన్కు ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’లో జాక్పాట్ తగిలింది. అబుధాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్(రూ.61.37కోట్లు) వచ్చాయి. ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News December 4, 2025
తిరుపతి: డ్రంక్ అండ్ డ్రైవ్.. భారీ జరిమానా

తిరుపతి పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 31 మంది డ్రైవర్లకు 3వ అదనపు మేజిస్ట్రేట్ సంధ్యారాణి బుధవారం రూ.3,10,000 జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP రామకృష్ణ చారి తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 25 మందికి రూ.500 చొప్పున రూ.12,500 జరిమానా విధించినట్లు తెలిపారు.


