News February 16, 2025

నిజాంసాగర్: ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను, కళాశాలను ఆదివారం కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి సలాం సందర్శించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షను ఆయన పర్యవేక్షించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Similar News

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

News March 17, 2026

రాజకీయాలకు వర్మ దూరం?.. వ్యాపారం వైపు అడుగులు!

image

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారు. పదవుల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వ్యాపార రంగం వైపు మళ్లారు. తాజాగా కాకినాడలో ఫైవ్‌స్టార్ హోటల్‌కు దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ, రాయితీలతో కూడిన జీవో జారీ చేసింది. దీంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి హోటల్ రంగంలోకి అడుగుపెట్టారని టాక్ నడుస్తోంది.

News March 17, 2026

TGRJC-CET-2026 నోటిఫికేషన్ విడుదల

image

TG: రాష్ట్రంలో 35 గురుకుల జూ.కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశానికి ‘TGRJC-CET-2026’ నోటిఫికేషన్ విడుదలయింది. MPC, BPC, MEC, CEC గ్రూప్స్‌లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టు మే3న నిర్వహిస్తారు. APR15 వరకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయొచ్చు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్: https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/