News February 10, 2025

నిజాంసాగర్: కాలువలో వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం

image

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి గల్లంతైన కర్రె విఠల్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మహమ్మద్ నగర్ మండలం బుర్గుల్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటర్ 3 వద్ద సోమవారం మృత దేహాన్ని వెలికితీసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 9, 2026

అంబటి రాంబాబుకు బెయిల్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.

News February 9, 2026

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఓటర్ గుర్తింపు పత్రాల పంపిణీ పూర్తయ్యిందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామన్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

News February 9, 2026

రెండేళ్లలో ఇద్దరు పిల్లలు.. తల్లులపై తీవ్ర ప్రభావం

image

వెంటవెంటనే ఇద్దరు పిల్లలను కనడం తల్లులపై తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి శరీరం పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చడం వలన అలసట, రక్తహీనత, నిద్రలేమి, డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరి పిల్లల మధ్య కనీసం 18 నెలల నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు తోబుట్టువుల మధ్య బాండ్ బలంగా ఉంటుందని సూచిస్తున్నారు.