News March 15, 2025
నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.
News October 30, 2025
జనగామ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూమ్

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించడానికి జనగామ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ రిజ్వాన్ బాషా రిబ్బన్ కట్ చేసి కంట్రోల్ రూమ్ సెంటర్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా 8520991823ను సంప్రదించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 30, 2025
BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


