News January 18, 2025

నిజాంసాగర్: నేడు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష

image

నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం నిర్వహించే 2025 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు శనివారం 10:30 వరకు పాఠశాలకు చేరుకోవాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మనుజే యోహనన్ తెలిపారు. 11 గంటల తర్వాత లోపలికి అనుమతించమని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

నెల్లూరులో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్

image

ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ వ్యవహారం నెల్లూరులో కలకలం రేపుతుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మిపురంలో ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన లోకేష్, అనంతసాగర్ మండలం దేవరాయపల్లికి చెందిన రాకేష్ ఇద్దరు కలిసి హాస్టల్లో ఉంటున్నారు. అయితే వారు మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 26, 2025

సజ్జనార్ డీపీ పెట్టుకుని..

image

TG: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే IPS ఆఫీసర్ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజులు పంపుతున్నారు. అలాంటి మెసేజులకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలే ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు.
* సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930

News October 26, 2025

తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

image

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.