News March 4, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

నిజాంసాగర్కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 12, 2025
‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి?

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనున్నారు. జగపతిబాబు, శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
News November 12, 2025
కష్టాలు ఎన్ని రకాలంటే..?

మనుషులు పడే కష్టాలను వేదాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అందులో మొదటిది ఆధ్యాత్మిక దుఖాలు. శరీరంలో కలిగే రోగాలు, కోపం, కపటం, బద్ధకం వల్ల అంతర్గతంగా ఏర్పడతాయి. రెండవది ఆది భౌతిక దుఃఖాలు. ఇవి పంచభూతాలు, శత్రువులు, జంతువులు, కీటకాల వంటి బయటి జీవుల వల్ల కలుగుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఇవి ప్రకృతి శక్తులైన అతివృష్టి, అనావృష్టి, పిడుగులు, గ్రహబాధల వల్ల సంభవిస్తాయి. వీటిని దాటడమే మోక్షం. <<-se>>#VedikVibes<<>>
News November 12, 2025
18 నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్సైట్లో ఉన్నాయన్నారు.


