News March 4, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

నిజాంసాగర్‌కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 12, 2026
ఘట్‌కేసర్: మార్ఫింగ్ ఫొటోలతో మహిళకు సైబర్ వేధింపులు

సోషల్ మీడియాలో మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో వెలుగుచూసింది. స్థానికంగా నివసించే మహిళ (38) స్నాప్‌చాట్‌లో భద్రపరచిన చిత్రాలను దుండగులు దుర్వినియోగం చేసి అసభ్యకరంగా మార్చి బంధువులకు పంపారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. బాధితురాలు 1930కు ఫిర్యాదు చేసి అనంతరం పోలీసులను ఆశ్రయించగా, నిందితుల కోసం సాంకేతిక దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 12, 2026
VZM: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. యువకుడి మృతి

ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందినట్లు సీఐ కె.నారాయణరావు చెప్పారు. ఆడారి వంశీ(28) పార్వతీపురం (M) కారాడవలస నుంచి బొబ్బిలి మండలం డొంగురువలస పెళ్లికి శుక్రవారం రాత్రి వచ్చాడు. ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వంశీ శనివారం మృతి చెందాడు. అతని తండ్రి తవిటన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
News April 12, 2026
సింహాచలం: రేపటి నుంచి చందనోత్సవం టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

సింహాచలంలో ఈనెల 20న చందనోత్సవం జరగనుంది. స్వామి వారి నిజరూప దర్శనం కోసం ఈనెల 13-17 వరకు టికెట్లను విక్రయించనున్నారు. రూ.300, రూ.1000 దర్శన టికెట్లను అక్కయ్యపాలెం, సింహాచలం యూనియన్ బ్యాంక్, సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖ SBIలో అమ్మనున్నారు. https://chandanotsavam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.


