News December 13, 2024
నిజాంసాగర్: రైతు సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి ఉత్తమ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగుచేసిన రాష్ట్రాల్లో TG మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. నాగమడుగు ఎత్తి పోతల పథక పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని మంత్రి హామి ఇచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
Similar News
News February 23, 2026
NZB: అందరి సహకారంతో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ సన్మానించారు.
News February 23, 2026
NZB: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.
News February 23, 2026
NZB: డెస్క్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ ఇవ్వాలి: DJFT

మీడియాలో పని చేసే ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (DJFT) నాయకులు కోరారు. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు ప్రభుత్వం అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో డెస్క్ జర్నలిస్ట్‌లను నియమించాలని కోరారు. ప్రతి జిల్లాలో 5 అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని కోరారు.


