News April 8, 2025

నిజాంసాగర్: స్నానానికి వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

image

మంజీరా నదిలో స్నానానికి వెళ్లి నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. నిజాంసాగర్ మండలం బంజేపల్లికి చెందిన భాగయ్య(48) మంజీరా నదిలో స్నానానికి వెళ్ళాడు. ప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతదేహం నీటి ఒడ్డున లభ్యమైంది.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

KKD: ఎడమొహం పెడమొహంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

image

KKD ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, MLC కర్రి పద్మశ్రీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని చర్చ సాగుతోంది. శ్రీలంక నుంచి మత్స్యకారులు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీని కొండబాబు తోసేశారని ఆమె అనుచరులు ఆరోపించారు. తాజాగా గురువారం మత్స్యకారులకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పద్మశ్రీని వేదికపైకి ఆహ్వానించలేదని, దీంతో ఆమె కార్యక్రమం నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.

News October 31, 2025

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో విషాదం.. కరెంట్ షాక్‌తో మృతి

image

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ ఎండీ కరీం(50) శుక్రవారం సాయంత్రం కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో పనులు జరుగుతుండగా, విద్యుత్ లైట్ సరిచేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు నింపింది.

News October 31, 2025

బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

image

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.