News March 10, 2025

నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

image

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.

Similar News

News March 10, 2025

NZB: కలెక్టర్‌ను కలిసిన నూతన సీపీ

image

నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. నూతన సీపీని కలెక్టర్ స్వాగతిస్తూ, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సీపీ పాల్గొన్నారు.

News March 10, 2025

NZB: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని నూతన సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

News March 10, 2025

NZB: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

image

నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డీపీఓగా ఉన్న ఈయనను ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ కార్యాలయం సిబ్బంది కొత్త డీపీఓకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ రావు జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

error: Content is protected !!