News March 23, 2025
నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 30, 2025
NZB: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
News March 30, 2025
నిజామాబాద్: ఉగాది ఎఫెక్ట్.. కొత్త కుండలకు గిరాకీ

ఉగాది పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. ఉగాది పర్వదినం సందర్భంగా కావలసిన వస్తువులు, పూజా సామగ్రి, కొత్త బట్టలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు అవసరమయ్యే కొత్త మట్టి కుండలకు గిరాకీ బాగా పెరిగింది. తోరణాలు కట్టేందుకు మామిడి ఆకులు, ఉగాది పచ్చడికి మామిడికాయలు, వేపపూత, చింతపండు, మోదుగ, బంతి, చామంతి పూలు భారీ రేటు పలికాయి.
News March 30, 2025
NZB: జిల్లాలో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం ధర్పల్లి, మంచిప్పలో అత్యధికంగా 41.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేంపల్లి, కోటగిరిలో 40.9, వేల్పూర్, చింతకుంటలో 40.8, పెర్కిట్ 40.7, తొండకూర్, ఇస్సాపల్లి 40.4, మెండోరా, లక్ష్మాపూర్ 40.3, బాల్కొండ 40.2, ఆలూరు, మాచర్ల, ముప్కాల్లో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికీ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.