News December 25, 2024

నిజామాబాదు: ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో పూర్వ కార్యకర్తలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర 43వ ఏబీవీపీ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ మోహన్ నరేష్ మాట్లాడుతూ.. విద్యార్థి పరిషత్ విద్యార్థుల పురోభివృద్ధిలో మమేకమై అనేక సమస్యల సాధనకు కృషి చేయడం దేశభక్తిని పెంపొందించడం నేర్పించిందన్నారు. జాతీయ పున:ర్నిర్మాణంలో నవతరం యువకులను తయారు చేయడమే ధ్యేయమన్నారు.

Similar News

News January 15, 2025

కామారెడ్డి:  చైనా మాంజా ఏం చేయలేదు

image

సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటాల చైనా మాంజాలు ప్రజలకు తాకి జిల్లాలో పలువురి గొంతులు తెగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కామారెడ్డి పట్టణ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైక్‌లపై వెళ్లే వారు ప్రమాదాల బారిన పడకుండా ఐరన్ కేబుల్‌ని బండికి బిగిస్తున్నారు. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు.

News January 15, 2025

డిచ్‌పల్లి: టీయూలో Ph.D అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ లా తదితర విభాగాల్లో కేటగరి-1 Ph.D అడ్మిషన్లకు సంబంధిత డీన్‌లు నోటిఫికేషన్‌లు జారీ చేశారు. యూజీసీ నెట్,CSIR నెట్ పరీక్షల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సంప్రదించాలన్నారు. 

News January 15, 2025

కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.