News March 4, 2025
నిజామాబాదు: చివరి ఆయకట్టుకు సాగు నీరు: సీఎస్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రానున్న పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన అందించాలన్నారు.
Similar News
News March 21, 2025
NZB: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఇప్పటికే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెల 22న మొదటి దశ (ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్), 24 నుంచి రెండో దశ (ఫిజిక్స్, ఎకనామిక్స్), 26 నుంచి మూడో స్పెల్ (కెమిస్ట్రీ, కామర్స్), 28వ తేదీ నుంచి నాలుగో స్పెల్ (హిస్టరీ, బోటనీ, జువాలజీ) మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు.
News March 20, 2025
NZB: చివరి రోజు 438 ఆబ్సెంట్

జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.
News March 20, 2025
నిజామాబాద్ జిల్లాకు నిరాశ!

రాష్ట్ర బడ్జెట్ నిజామాబాద్ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు సంబంధించి భూసేకరణ ఊసేలేదు. కాగా శ్రీరాంసాగర్ మెుదటి దశ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. కాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. జిల్లాకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.