News July 28, 2024

నిజామాబాద్‌కు 64 ఎలక్ట్రికల్ బస్సులు

image

నిజామాబాద్ జిల్లాలకు 64 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా NZB డీపో-2కు 12 బస్సులు కేటాయించగా శనివారం 3 వచ్చాయి. మరో 8 కంపెనీ నుంచి రానున్నాయి. NZB, కరీంనగర్ జిల్లాలకు కలిపి మొదటి విడతగా 100 బస్సులు కేటాయించారు. వీటిలో ఇంకా NZBకు 48 రానున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో విడతలో 16 బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు.

Similar News

News November 12, 2025

ఆర్మూర్: బ్రిడ్జి పనుల్లో జాప్యం.. దుమ్ము ధూళితో శ్వాసకోశ ఇక్కట్లు

image

ARMR- NZB వెళ్లే మార్గంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిపై కంకర వేసి, నీరు కొట్టకపోవడం వల్ల భారీగా దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. ఈ ధూళి కళ్లు, ముక్కులోకి చేరడం వల్ల వాహనదారులు, అడవి మామిడిపల్లి గ్రామస్థులు తీవ్రశ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెంటనే రోడ్డుపై తారువేసే పనులను ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News November 11, 2025

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీయూ విద్యార్థి సంఘాలు

image

తెలంగాణ యూనివర్సిటీలో 2012 లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని NSUI,PDSU నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశంలో NSUI, వర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం,PDSU నాయకులు అనిల్ కుమార్ మాట్లాడారు.తప్పుడు పత్రాలతో నియామకం అయిన వారిని తొలగించి,హైకోర్టు తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు రాజు, గోవింద్,మహేష్,అరుణ,పవిత్ర,నవీన్ తదితరులున్నారు.

News November 11, 2025

నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.