News March 25, 2024
నిజామాబాద్‌లో మాయమాటలు చెప్పి లక్ష మాయం

నిజామాబాద్ పెద్ద బజారులోని లక్ష్మీనరసింహ కిరాణ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ICICI బ్యాంక్ ఉద్యోగినంటూ యాజమానిని నమ్మించాడు. కరెంట్ అకౌంట్‌తో పాటు క్యూఆర్ కోడ్ అప్డేట్ చేయాలని చెప్పి, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు అడిగాడు. యాప్ డౌన్లోడ్ చేస్తానని నమ్మించి ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.లక్ష మాయమైనట్టు గుర్తించిన బాధితుడు రాజ్ కుమార్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Similar News
News November 27, 2025
NZB: చట్టబద్ధత దత్తతనే శ్రేయస్కరం: రసూల్ బీ

చట్టబద్ధత దత్తత శ్రేయస్కరం అని మహిళా శిశు సంక్షేమ శాఖ NZB జిల్లా సంక్షేమ అధికారిణి ఎస్.కె.రసూల్ బీ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం పిల్లల దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగుల పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
News November 27, 2025
మీడియా సెంటర్‌ను ప్రారంభించిన NZB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్‌లోని రూమ్ నం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (MCMC)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ అంకిత్, DPO శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
News November 27, 2025
NZB: మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ ల దాఖలు పర్వం మొదలైంది. తొలి దశ ఎన్నికలు జరిగేబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గురువారం ఉదయం నామినేషన్ లు దాఖలాలు చేయడం మొదలుపెట్టారు.


