News April 18, 2024

నిజామాబాద్‌లో మొదటి రోజు 2 నామినేషన్లు

image

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా భుక్యానంద్ నామినేషన్ వేసినట్లు వెల్లడించారు.

Similar News

News December 9, 2025

నిజామాబాద్: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

image

నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 184 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.

News December 9, 2025

నిజామాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, సాలూర, నవీపేట్, రెంజల్, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాల్లోని 184 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 8, 2025

నిజామాబాద్: వారంరోజుల్లో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు.