News April 18, 2024

నిజామాబాద్‌లో మొదటి రోజు 2 నామినేషన్లు

image

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా భుక్యానంద్ నామినేషన్ వేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 16, 2024

భీమ్‌గల్: ఆటో బోల్తా.. బాలుడి మృతి

image

భీమ్‌గల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్ నుంచి సంతోశ్‌నగర్ తండాకు 5గురు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా రియాన్ అనే బాలుడి తలకు గాయమైంది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

News September 16, 2024

NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

image

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.

News September 16, 2024

ఫిలిప్పీన్స్‌లో వేల్పూర్ యువకుడి మృతి

image

ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలానికి చెందిన అక్షయ్ మృతి చెందాడు. అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరో ఐదు నెలలో ఎంబీబీఎస్ కావస్తున్న సమయంలో అక్షయ్ ఆకస్మిక మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.