News April 8, 2025

నిజామాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.

Similar News

News July 6, 2025

NZB: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు నిజామాబాద్ 4వ టౌన్ SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్‌కు చెందిన మల్లెపూల సందీప్ కుమార్(36) వ్యాపారంలో నష్టాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 6, 2025

పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

image

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

image

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.