News November 9, 2024
నిజామాబాద్‌లో లారీ క్లీనర్ హత్య
వ్యక్తి హత్యకు గురైన ఘటన NZBలో జరిగింది. మద్నూర్‌కి చెందిన లక్ష్మణ్(30) లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. శుక్రవారం కాలూరు కూడలి వద్ద తీవ్ర గాయాలతో పడిఉన్న లక్ష్మణ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడిని ఎవరో తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాతకక్షలు నేపథ్యంలో హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
Similar News
News December 11, 2024
NZB: UPDATE.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన వారు నిజామాబాద్‌కు చెందిన కస్తూరి ప్రమోద్, అంకడి సంజయ్ గా గుర్తించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఈ ఇద్దరు జక్రాన్ పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్ 44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
News December 10, 2024
గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్
గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్ల ఆయన తెలిపారు.
News December 10, 2024
పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు దాదాపుగా 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.