News April 28, 2024
నిజామాబాద్‌లో BRSకు షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఈగ గంగారెడ్డి
నిజామాబాద్‌లో BRS పార్టీకి షాక్ తగిలింది. BRS పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఆదివారం కాంగ్రెస్ MP అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా బోర్గం గ్రామానికి చెందిన గంగారెడ్డి 2002 నుంచి BRS పార్టీ (అప్పటి TRS)లో కొనసాగుతూ నేడు కాంగ్రెస్‌లో చేరారు.
Similar News
News November 12, 2024
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: KMR కలెక్టర్
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని అధికారులకు సూచించారు.
News November 12, 2024
NZB: రైలులో రెండేళ్ల బాలుడు లభ్యం
రైలులో రెండేళ్ల బాలుడు లభ్యమైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో బాసర రైల్వే స్టేషన్ వద్ద S6 కోచ్‌లో రెండేళ్ల బాలుడిని స్థానికులు గుర్తించారు. చుట్టుపక్కల వెతికినా ఎవరూ లేకపోవడంతో రైల్వే ఎస్ఐ, సిబ్బంది కలిసి బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ సభ్యులకు అప్పగించారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News November 11, 2024
నిజామాబాద్: ప్రజావాణిలో 70 ఫిర్యాదులు
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌ఛార్జ్ డీపీఓ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.