News September 23, 2024

నిజామాబాద్‌లో BRSకు షాక్.. MIMలో పలువురి చేరిక

image

నిజామాబాద్‌లో BRS పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు MIM గూటికి చేరారు. నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీఖాన్, వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ ఫయాజ్, 57వ డివిజన్ ఇన్ ఛార్జ్ అమర్ తదితరులు సోమవారం MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నగరంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 9, 2024

NZB: సద్దుల బతుకమ్మ రేపు.. శనివారం దసరా

image

సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.

News October 9, 2024

NZB: మేమున్న చోటుకే రావాలి: డిజిటల్ సర్వే చిత్రాలు

image

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నిజామాబాద్ నగరంలో తూ తూ మంత్రంగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా 3వ డివిజన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-2లో నిన్న జరిగిన సర్వే సందర్భంగా నవీపేట్ ప్రాంతానికి చెందిన సర్వే బృందం సభ్యులు తామున్న చోటుకే సర్వే కోసం రావాలన్నారని తెలిపారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో వృద్ధులను కిందికి వచ్చి సర్వేలో కిందకు రావాలని చెప్పి వారు వెళ్లిపోయారన్నారు.

News October 9, 2024

భీంగల్: టాటా ఏస్ ఢీకొని బాలుడు మృతి

image

భీంగల్ పట్టణంలో అతివేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం భీంగల్ నుంచి సిరికొండకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం డ్రైవర్ అఫ్రోజ్ భీంగల్ పట్టణంలో నంది నగర్ వద్ద రోడ్డు దాటుతున్న తోపారపు నిశ్వంత్(7)ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.