News January 29, 2025

నిజామాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో​ అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన మారుతి నగరంలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సాయినగర్ ​రోడ్​ నంబర్-1​లో మంగళవారం మారుతి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 20, 2025

అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

image

అక్రమ కేసులతో బీఆర్‌ఎస్, కేటీఆర్‌ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.

News November 20, 2025

NZB: మూగజీవాలను సైతం వణికిస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలలో వణికిస్తున్న చలిపులి మూగజీవాలను సైతం వదలడం లేదు. చలికి మనుషులతో పాటు మూగజీవాలు కూడా గజగజ వణుకుతున్నాయి. కొందరు చలిమంట వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతుండగా వారు వేసుకున్న చలిమంట వద్ద మూగజీవాలు సేదదీరుతున్నాయి. NZB నగరంలో రెండు కుక్క పిల్లలు వెచ్చదనం కోసం ఇలా చలి మంటకాచుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News November 20, 2025

SRSP 24 గంటల్లో 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు పోతుండగా సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 వదిలామన్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.