News March 25, 2024
నిజామాబాద్: అమ్మాయి కోసం యువకుల గొడవ
ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన HYDఅమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ వాసులు నితిన్, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వెళ్లింది. అక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.
Similar News
News November 10, 2024
బడాపహాడ్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం
వర్ని మండలం బడాపహాడ్ మెట్ల సమీపంలోని కాలువ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు వర్ని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మృతురాలి వయసు 70 ఏళ్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాలకృత్యాల కోసం వెళ్లి కాలువలో పడి మృతి చెందిఉంటుందని భావిస్తున్నారు. బడాపహాడ్ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని పోలీసులు తెలిపారు.
News November 10, 2024
NZB: 4.2 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బంది
నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ నుంచి మాధవనగర్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 4.2 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ SHOబి.దిలీప్ కుమార్ తెలిపారు. ఒక కేసులో నిజామాబాద్ అసద్ బాబా నగర్ కి చెందిన సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 2.1 కేజీల గంజాయి, పల్సర్ బైక్ ను సీజ్ చేయగా ద్వారకానగర్‌కి చెందిన సాజిత్ అలీ ఆటోలో 2.1 కిలోలు పట్టుకోగా నిందితుడు పరారయ్యాడన్నారు.
News November 10, 2024
నందిపేట్‌లో వివాహితపై అత్యాచారం
వివాహితను అత్యాచారం చేసిన ఘటన నందిపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆర్మూర్ CI వివరాలు.. ఈ నెల 6న ఉమ్మెడకు చెందిన అరుణ్, ముత్యం మద్యం తాగి భాగ్యమ్మ సాయంతో ఓ మహిళను అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు భాగ్యమ్మను కొట్టడంతో మంత్రాల నెపంతో తనను కొట్టారంటూ ఆమె ACPకి ఫిర్యాదు చేసింది. శుక్రవారం విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో అరుణ్, ముత్యం, భాగ్యమ్మను అరెస్ట్ చేశారు.