News February 20, 2025
నిజామాబాద్: ఆకాశవాణి ఎఫ్ఎమ్ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్

నిజామాబాద్ ఆకాశవాణి ఎఫ్ఎమ్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తెలంగాణ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ బానోత్ హరిసింగ్ సందర్శించారు. శ్రోతలకు ఇష్టమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆకాశవాణి ఉద్యోగులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట సుబ్బయ్య, ఇంజినీర్ కార్యక్రమాల నిర్వహణ, పరిపాలన సిబ్బంది, అధికారులు, పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.
News November 20, 2025
తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.


