News August 10, 2024
నిజామాబాద్: ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి

ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని నిజాం కాలానికి చెందిన అన్వర్(42) ఆర్సపల్లి బైపాస్ నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్ళే మార్గ మధ్యంలో ఆగివున్న లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News February 25, 2026
నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.
News February 25, 2026
నిజామాబాద్: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషేదం

మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.