News April 10, 2025

నిజామాబాద్: ఆపరేషన్ చబుత్రా.. మళ్లీ స్టార్ట్

image

నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ చబుత్రా’ మళ్లీ ప్రారంభమైంది. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కొంత కాలం పక్కాగా అమలు చేసి తర్వాత వదిలేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఇటీవల మళ్లీ ఆపరేషన్ చబుత్రా ను షురూ చేశారు. మంగళవారం సాయంత్రం NZB శాంతి నగర్‌లో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Similar News

News October 29, 2025

ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుకల నేపథ్యంలో ఐక్యత పాదయాత్ర (యూనిటీ మార్చ్) చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐక్యత పాదయాత్ర నిర్వహణ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటేల్ జయంతి ఉత్సవాల వేడుకలను చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 29, 2025

WGL: ఇంటర్ కళాశాలలకు సెలవు

image

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వరంగల్ డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమాచారం చేరవేస్తూ సెలవు ప్రకటించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపధ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

News October 29, 2025

తుఫాన్ బాధితులకు బాబు భరోసా..!

image

తుఫాన్ బాధితులకు భరోసా కల్పించడానికి CM చంద్రబాబు రంగంలోకి దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం(M) ఓడలరేవులో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తన చేతుల మీదుగా సరుకులు, ఒక్కో కుటుంబానికి రూ.3వేలు ఇచ్చారు. పలువురిని సీఎం ఆప్యాయంగా పలకరించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన అరగట్లపాలెం, బెండమూరులంకలో నీట మునిగిన పొలాలను పరిశీలించి ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.