News March 15, 2025
నిజామాబాద్: ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే రాములోరి తలంబ్రాలు

నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు.
Similar News
News April 17, 2026
నిప్పుల కొలిమిలా నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. అత్యధికంగా ఎడపల్లి, ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో కూడా 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. జిల్లాలో అంతటా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఆందోళనకరం.
News April 17, 2026
NZB: 500 ఏళ్ల పురాతన క్షేత్రం.. నీలకంఠేశ్వర ఆలయం

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఆలయం సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన క్షేత్రం. ఉత్తర భారత శిల్పకళా రీతిలో ఉన్న ఈ కోవెల శివభక్తులకు పరమ పవిత్రం. ఇక్కడి శివలింగం, ఆలయ ప్రాకారం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. శతాబ్దాలు గడిచినా నాటి నిర్మాణ చాతుర్యం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ పురాతన కట్టడాలను భావితరాలకు అందించాలి.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 17, 2026
ఇందూరు కోట.. ఖిల్లా రఘునాథ ఆలయం

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించగా, అనంతరం ఛత్రపతి శివాజీ దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడి రామమందిరం ఆధ్యాత్మికతకు నిలయం. కోటలోని రాతి కట్టడాలు, బురుజులు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యాలు. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నుండి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం


