News July 27, 2024
నిజామాబాద్: ఇద్దరు ACP లకు ASPలుగా పదోన్నతి
నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు ACP లకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 మంది డీఎస్పీలకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా ప్రమోషన్ కల్పిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేయగా ఆర్మూర్ ACP బస్వా రెడ్డి, CCS ACP బి.కిషన్ అడిషనల్ SPలుగా ప్రమోషన్ పొందారు. వీరు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Similar News
News October 11, 2024
కామారెడ్డి: ఈ ఊళ్లో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం
కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్‌లో సద్దుల బతుకమ్మ రోజు కుటుంబ సభ్యుల్లోని మగవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పెద్ద బతుకమ్మలను ఎత్తుకుంటారు. ఏటా ఇలాగే ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొంటారు. కేవలం మహిళలకే పరిమితం కాకుండా మగవారు కూడా బతుకమ్మ ఉత్సవాలు ముగిసే వరకు సమయం కేటాయిస్తారు.
News October 10, 2024
కామారెడ్డి : లింగాకృతిలో బతుకమ్మ
లింగాకృతిలో బతుకమ్మను మహిళలు తయారు చేశారు. ఆ బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డు విద్యుత్‌నగర్ కాలనీ, దేవుపల్లికి చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వైద్య ఉమారాణి థర్మాకోల్ ఉపయోగించి శివలింగాకృతిలో పూలతో బతుకమ్మ తయారుచేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రకృతిపరంగా, ఆధ్యాత్మికపరంగా ఈ బతుకమ్మ ఎంతో శోభను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.
News October 10, 2024
కామారెడ్డి: అక్క ఆత్మహత్యాయత్నం.. బాధతో చెల్లి సూసైడ్
కామారెడ్డి జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. వివరాలు.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మమతకు మోషంపూర్ వాసితో పెళ్లైంది. వారిమధ్య మనస్పర్థలు రాగా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసింది. బాధతో ఆమె చెల్లి ప్రత్యూష సైతం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రత్యూష చనిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.