News December 20, 2024
నిజామాబాద్: కట్నం కోసమే చంపేశారా..?

ఫోక్ సింగర్ <<14919989>>శ్రుతి<<>>(26) బుధవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. NZB జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన ఆమెకు గత నెల 24న వివాహం జరిగింది. కాగా, పెళ్లైనా రోజు నుంచే భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించేవారని శ్రుతి తమకు చెప్పినట్లు తెలిపారు. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రుతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 24, 2026
NZB: గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను చూడాలన్నారు.
News February 24, 2026
NZB: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: CP

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అల్లర్లు జరిగితే ఎవరిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.