News December 20, 2024

నిజామాబాద్: కట్నం కోసమే చంపేశారా..?

image

ఫోక్ సింగర్ <<14919989>>శ్రుతి<<>>(26) బుధవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. NZB జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన ఆమెకు గత నెల 24న వివాహం జరిగింది. కాగా, పెళ్లైనా రోజు నుంచే భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించేవారని శ్రుతి తమకు చెప్పినట్లు తెలిపారు. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రుతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 22, 2025

NZB: జాబితాలో నుడా మాజీ ఛైర్మన్ భార్య పేరు

image

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నుడా మాజీ ఛైర్మన్ భార్య పేరు రావడం బుధవారం నిజామాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. 43వ డివిజన్‌లో పాత అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన వార్డుసభ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి జాబితా పరిశీలించారు. ఇందులో నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ భార్య చామకూర విశాలిని రెడ్డి పేరు (సీరియల్ నంబర్ 106) (ఇటుకల గోడ) రావడంతో అంతా అవాక్కయ్యారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

News January 22, 2025

కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే: కవిత

image

బీఆర్ఎస్ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని నిజామాబాద్ MLC కవిత అన్నారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం BRS పార్టీదని, BRS కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా BRS కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు.

News January 22, 2025

దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి: NZB కలెక్టర్

image

గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ప్రత్యేకించి అద్దె ఇంట్లో ఉన్నామని వచ్చే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.