News November 11, 2024
నిజామాబాద్ కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్ర్య భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మౌలానా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
Similar News
News December 8, 2024
NZB: ముగ్గురు బిడ్డలను అమ్మేసిన కసాయి తల్లి
కన్నతల్లే ముగ్గురు బిడ్డలను అమ్మేసిన ఘటన ఆర్మూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. SHO సత్యనారాయణ వివరాలు.. మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్యి భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నది. కాగా మొదటి భర్తకు పుట్టిన ఏడేళ్ల బాబు, ఇద్దరు మగ కవల పిల్లలను రూ.4లక్షలకు ముగ్గురు వ్యక్తులకు విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెతో పాటు పిల్లలను కొన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
News December 8, 2024
పిట్లం: వివాహిత ఆత్మహత్య.. కారణమిదే..!
పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్సై రాజు వివరాలిలా.. ఖంబాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర మీనా (25) తన భర్త అయిన సాయిలుతో శుక్రవారం రాత్రి కుటుంబ సమస్యల విషయంలో గొడవ జరిగింది. మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
News December 8, 2024
బోధన్: 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన యువకుడి రిమాండ్
బోధన్ మండలంలో ప్రేమ పేరుతో 17 ఏళ్ల బాలికను మోసం చేసిన యువకుడిని పోలీసులు శనివారం రిమాండ్ చేశారు. రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ.. బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి అమ్మాయికి ఇన్స్ స్ట్రా గ్రామ్ లో యువకుడికి పరిచయమయింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు.