News October 23, 2024

నిజామాబాద్: కొండెక్కిన చికెన్ ధరలు..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు చికెన్ ధర ఆకాశాన్ని తాకుతోంది. వారం రోజులుగా NZB చెకెన్ షాపుల్లో స్కిల్ లెస్ రూ. 240, విత్ స్కిన్ రూ. 200 పలుకుతోంది. ఇక గ్రామాల్లోని చికెన్ సెంటర్లలో రూ. 250 ఉంది. దీంతో మాంసం ప్రియులు వెనక్కి తగ్గుతున్నారు. 1కేజీ తీసుకోవాలనుకున్న వారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడమే ఇందుకు కారణమని షాపు యజమానులు అంటున్నారు.

Similar News

News November 18, 2025

నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

image

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.