News June 27, 2024
నిజామాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్లు

టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిజామాబాద్ బీసీ స్టడీ సెంటర్లో గ్రాండ్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.

NZB: టీ-పోల్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ-పోల్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే వివరాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.