News May 19, 2024
నిజామాబాద్: చిన్నారిని బలి తీసుకున్న కూలర్
నగరానికి చెందిన గంగస్థాన్‌లో నివాసం ఉంటున్న వినీత్, దీపికలకు చెందిన కూతురు స్నీటిక కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. స్నీటిక వేసవి సెలవుల నిమిత్తం తన బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలర్‌ను తాకడంతో కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది.
Similar News
News December 13, 2024
నిజాంసాగర్: రైతు సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి ఉత్తమ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగుచేసిన రాష్ట్రాల్లో TG మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. నాగమడుగు ఎత్తి పోతల పథక పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని మంత్రి హామి ఇచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
News December 13, 2024
కామారెడ్డి: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లాలో పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం గొర్గల్ గ్రామ హెలిప్యాడ్ వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మంత్రి వెంట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
News December 13, 2024
BREAKING: NZB: బాలికతో అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపారు!
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.