News January 5, 2025
నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలనతో ముందుకు సాగుతున్న విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజీపీకి లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 31, 2025
ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.
News October 30, 2025
రంగు మారిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలి: ఎమ్మెల్యేలు

అకాల వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తడిసిన వరి ధాన్యాన్ని తేమ చూడకుండా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
News October 30, 2025
NZB: నీలకంఠేశ్వరుడి సేవలో కలెక్టర్ దంపతులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కలెక్టర్ వినయ్‌కృష్ణా రెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి ఉన్నారు.


