News August 10, 2024
నిజామాబాద్ జిల్లాకు 13 ఎలక్ట్రిక్ బస్సులు

నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి RTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని పనులు మిలిగి ఉండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేశారు. బస్సులకు ఛార్జింగ్ పెట్టడానికి 11 ఛార్జింగ్ పాయింట్లు పూర్తయ్యాయి. జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని అర్టీసీ అధికారులు ప్రకటించారు.
Similar News
News December 1, 2025
NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
News December 1, 2025
NZB: రెండో దశ తొలి రోజు 270 నామినేషన్లు

NZB జిల్లాలో రెండో విడతలో జరగనున్న 8 మండలాల్లో తొలి రోజైన ఆదివారం 196 సర్పంచి స్థానాలకు 122, 1760 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో NZB డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్ పల్లి మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.