News August 5, 2024
నిజామాబాద్ జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. వివరాలిలా.. ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలోని 2-వ టౌన్ పరిధిలోని ITI కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో ఇంట్లో వాళ్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 30, 2025
NZB: అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్కు జిల్లా ఉపాధ్యాయుడు

NZB దుబ్బ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చల్లా ముద్దుకృష్ణ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(IISF)-2025కు ఎంపికయ్యారు. డిసెంబర్ 6 నుంచి 9 పంజాబ్ రాష్ర్టంలోని చండీఘడ్లో నిర్వహించనున్న కార్యక్రమంలో 2 ప్రధాన విభాగాల్లో పాల్గొనడానికి అధికారికంగా ఆహ్వానం అందుకున్నారు. సైన్స్ సఫారీ-సైన్స్ టాయ్స్ అండ్ గేమ్స్ అడ్వెంచర్, ఎంపవరింగ్ ఇండియా-యంగ్ సైంటిస్ట్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొంటారు.
News November 30, 2025
NZB: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ప్రజావాణి రద్దు

ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేశామన్నారు. GP ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News November 30, 2025
NZB: మొదటి విడతకు 4,700 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో 3 రోజుల్లో మొత్తం 4,700 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. 184 సర్పంచి స్థానాలకు 1,167 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 3,533 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. శనివారం చివరి రోజు సర్పంచి స్థానాలకు 863 నామినేషన్లు, వార్డు మెంబర్ల స్థానాలకు 3,151 నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు.


