News July 6, 2024
నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

జిల్లాలోని నవీపేట మండలం కమలాపూర్, మోకన్ పల్లి శివారులో శుక్రవారం చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన గాంధీ తన మేకలను తీసుకొని గుట్టకు వెళ్లాడు. సాయంత్రం చిరుత తన మందపై దాడి చేసినట్లు రైతు పేర్కొన్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో NZB బీట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ జహుర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరత సంచారం నిజమేనని వెల్లడించారు.
Similar News
News October 22, 2025
NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.
News October 22, 2025
నిజామాబాద్: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలంపాడ్ గ్రామంలోని క్యాంప్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అందించాలని, తూకం, మిల్లులకు తరలింపు సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
News October 21, 2025
NZB: కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, సాలూర మండలం సాలెంపాడ్ క్యాంపుల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.