News January 22, 2025
నిజామాబాద్ జిల్లాలో తొలిరోజు 20,588 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో 20,588 అప్లికేషన్స్ స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,326, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 2,708, రేషన్ కార్డుల కోసం 13,554 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల గ్రామసభ ప్రశాంతంగా జరగ్గా, మరికొన్ని చోట్ల రసాభాసగా మారింది. గాదెపల్లిలో సభ బహిష్కరించారు.
Similar News
News October 26, 2025
నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్ నగర శివారులోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.
News October 26, 2025
NZB: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి’

ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NZB కలెక్టర్, ఇతర అధికారులతో ఆయన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.


