News August 9, 2024

నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీలు

image

నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగిస్తూ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ -1 పరిధిలోని 40 మంది ఎస్సైలకు స్థాన చలనం చేస్తూ ఉత్తర్వులు వెలువడగా ఎం.డి. యాసర్ అరాహత్‌ను 2వ టౌన్ ఎస్‌హెచ్‌వోగా అక్కడ పని చేస్తున్న రాంను సిరికొండ ఎస్ హెచ్‌ఓగా బదిలీ చేశారు. 3వ టౌన్ ఎస్సై ప్రవీణ్ ను ఆదిలాబాద్ జిల్లాకు శ్రీకాంత్ 4వ టౌన్ ఎస్ హెచ్ వోగా బదిలీ చేశారు.

Similar News

News April 14, 2026

నిజామాబాద్: జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

image

నిజామాబాద్ ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. హెచ్‌పీవీ టీకాలు, డెంగీ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.

News April 14, 2026

NZB: టాస్‌ (TOSS) పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో SSC, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలు, టైమ్ టేబుల్ సిద్ధంగా ఉన్నాయన్నారు.

News April 14, 2026

ఇందల్వాయి: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఇందల్వాయి మండలం గంగారం తండా సమీపంలో ఎన్‌హెచ్-44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గంగార తండా శివారులో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.