News August 24, 2024
నిజామాబాద్ జిల్లాలో పెరిగిన చిరుతల సంఖ్య
జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. ఇటీవల పశువులు, జనాలపై చిరుతల దాడులు పెరిగాయి. NZB, ఇందల్వాయి, వర్ని, రేంజల్ పరిధిలో గడిచిన మూడేళ్లలో చిరుతల సంఖ్య 80 వరకు పెరిగింది. కాగా ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సౌత్ రేంజ్ ఇన్‌ఛార్జ్ అధికారి రవిమోహన్ సూచించారు.
Similar News
News September 17, 2024
NZB: వినాయక నిమజ్జనం.. కావొద్దు విషాదం..!
వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. అయితే వినాయకుడికి గంగమ్మ చెంతకు తీసుకెళ్లే క్రమంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ ఏటా ఉమ్మడి NZB జిల్లాలో నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటా వినాయక నిమజ్జనం విషాదం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ..గణేష్ నిమజ్జనం చేద్దాం.
News September 16, 2024
భీమ్‌గల్: ఆటో బోల్తా.. బాలుడి మృతి
భీమ్‌గల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్ నుంచి సంతోశ్‌నగర్ తండాకు 5గురు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా రియాన్ అనే బాలుడి తలకు గాయమైంది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
News September 16, 2024
NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.