News March 1, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 1, 2025
బోధన్: సాగునీటి సమస్య తలెత్తితే అధికారులదే బాధ్యత: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షించారు.
News March 1, 2025
సాలూర పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
News March 1, 2025
NZB: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్లో చండీ కృష్ణ (37) అనే వ్యవసాయ కూలీ ఫిట్స్తో మృతి చెందాడు. అలాగే రుద్రూర్ మండల కేంద్రంలో కాదారి సాయినాథ్ (38) అనే రైతు పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ బురదలో పడి మృతి చెందాడు. అదేవిధంగా నగరంలోని పూసలగల్లీలో బద్దురి లక్ష్మణ్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.