News April 1, 2025

నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగ

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మోస్రాలో 41.5℃, ఎడపల్లి 41.4, పెర్కిట్ 41.4, కోటగిరి 41.4, నిజామాబాద్ 41.3, గోపన్నపల్లి 41.3, వేంపల్లి 41.2, వైల్పూర్ 41.1, మెండోరా 41.1, ధర్పల్లి 41, మగ్గిడి 40.9, మోర్తాడ్ 40.8, రెంజల్ 40.7, ఇస్సాపల్లి 40.6, చిన్నమావంది 40.6, జక్రాన్‌పల్లి 40.6, కమ్మర్‌పల్లి 40.5, మదనపల్లి 40.5, సాలూర 40.3, భీమ్‌గల్ 40.3, కొండూరు 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News April 4, 2025

నిజామాబాద్: దరఖాస్తుల ఆహ్వానం

image

నిజామాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 4, 2025

NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

image

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

జైతాపూర్‌లో పంట కాలువలో పడి మహిళ మృతి

image

ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) అనే మహిళ పంట కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు ఏప్రిల్ ఒకటో తేదీన నిజామాబాద్ వెళ్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని, పంట కాలువలో తన చెల్లి చనిపోయిన స్థితిలో ఉన్నట్టు పోలీసులకు పురిమేటి నాగయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

error: Content is protected !!