News March 3, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పోతంగల్, కోటగిరిలో 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా- 38.9, లక్మాపూర్- 38.5, చిన్న మావంది, జక్రాన్పల్లి -38.4, ధర్పల్లి -38.3, సాలూరా, వేపూర్- 38.1, ఎడపల్లి -38, గోపన్నపల్లి- 37.9, కమ్మర్పల్లి, పెర్కిట్ -37.7, మంచిప్ప, రెంజల్ -37.6, వెంపల్లి, నిజామాబాద్ -37.5, తొండకూర్, కల్దుర్కి, కొండూర్- 37.3, మోర్తాడ్- 37.2, ఏర్గట్లలో 37.1℃గా నమోదైంది.
Similar News
News September 16, 2025
నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News September 16, 2025
నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
News September 16, 2025
నిజామాబాద్: ఓటర్ల జాబితా సవరణకు సిద్ధంగా ఉండాలి

నియోజకవర్గాల పరిధిలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026’ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.