News March 3, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పోతంగల్, కోటగిరిలో 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా- 38.9, లక్మాపూర్- 38.5, చిన్న మావంది, జక్రాన్‌పల్లి -38.4, ధర్పల్లి -38.3, సాలూరా, వేపూర్- 38.1, ఎడపల్లి -38, గోపన్నపల్లి- 37.9, కమ్మర్‌పల్లి, పెర్కిట్ -37.7, మంచిప్ప, రెంజల్ -37.6, వెంపల్లి, నిజామాబాద్ -37.5, తొండకూర్, కల్దుర్కి, కొండూర్- 37.3, మోర్తాడ్- 37.2, ఏర్గట్లలో 37.1℃గా నమోదైంది.
Similar News
News March 17, 2025
NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు మొత్తం 831 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, నేటి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.
News March 17, 2025
ఎడపల్లి: కుళ్లిన స్థితిలో మృతదేహం

ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. గ్రామ సమీపంలోని D-46 కెనాల్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని పంచాయతీ కార్యదర్శి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎడపల్లి SI వంశీకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరీవాహక ప్రాంతాల్లో ఎవరైనా కనిపించకపోతే తమకు సమాచారం ఇవ్వాలని SI తెలిపారు.
News March 17, 2025
ధర్పల్లి: మల్లయ్యను చంపిన భార్య, కొడుకు

ధర్పల్లి (M) హోన్నాజిపేట్లో <<15782697>>మల్లయ్య <<>>హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన మల్లయ్యకు కొన్నెళ్లుగా భార్యతో, కొడుకుతో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం తండ్రీకొడుకులు గొడవపడగా విషయాన్ని తల్లికి చెప్పాడు. దీంతో తల్లీకొడుకులు మల్లయ్యతో గొడవపడి కొందకు పడేసి, బీరుసీసాతో తలపై కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.