News April 13, 2025
నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్లు నిజామాబాద్లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 9, 2025
తంబళ్లపల్లి: ‘టమాటా రైతులను ఆదుకోండి’

టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తంబళ్లపల్లి (M)లో టమాటాను పండించిన రైతులు తుఫాన్ ప్రభావంతో గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేస్తున్నామంటున్నారు. గుండ్లపల్లి, గోపిదిన్నె, కన్నెమడుగు, కొటాల తదితర పంచాయతీల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పంటలు వేశామన్నారు. ఎకరాకు రూ.2 లక్షలు వరకు ఖర్చును ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
News November 9, 2025
సిద్దిపేట: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చని, ఈనెల 15 వరకు ప్రతి రోజు లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. చిన్న చిన్న కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశమని, రాజీ పడదగిన కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
– SHARE IT
News November 9, 2025
ములుగులో బాలుడి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమా?

కన్నాయిగూడెం మండలం గూరేవులకు చెందిన హరినాథ్(7) పాముకాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పాముకాటుకు వైద్యుడి పర్యవేక్షణలో యాంటీ డోస్ ఇవ్వాల్సి ఉండగా, ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బంది సరైన రీతిలో స్పందించక పోవడంతో ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు.


