News July 17, 2024

నిజామాబాద్ జిల్లాలో 44,469 మందికి రుణమాఫీ

image

రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ పథకంలో నిజామాబాద్ జిల్లాలో 44,469 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. కాగా తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నారు. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ, ఆగస్టులో రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.

Similar News

News October 30, 2025

NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. గేట్లు ఎత్తివేత..!

image

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R.బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.

News October 30, 2025

NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. పాక్షికంగా కొన్ని గేట్లు ఎత్తివేత.!

image

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R. బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.

News October 30, 2025

నిజామాబాద్: పశు సంవర్ధక శాఖ సేవలు మెరుగు పరచాలి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయం మినీ కాన్ఫరెన్సు హాల్‌లో ఆయన పశు సంవర్ధక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశు సంపద కలిగిన రైతులకు అవసరమైన సేవలు అందించేలా పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.