News August 15, 2024
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతం
బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం బంద్ విజయవంతమైంది. నిజామాబాద్‌లో బైక్‌ర్యాలీని గాంధీచౌక్ నుంచి బస్టాండ్, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, హైదరాబాద్ రోడ్డు మీదుగా కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి శివాజీ చౌక్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Similar News
News September 15, 2024
NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ
నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహబ్ పహాడ్ లో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాబన్ సాహబ్ పహాడ్‌కుచెందిన షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఉన్న 2 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.
News September 15, 2024
రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News September 15, 2024
వినాయకుడికి పూజలు నిర్వహించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి పట్టణంలోని వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిని వినాయక మండప నిర్వాహకులు సన్మానించారు.