News January 31, 2025

నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల

image

నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం ఎమ్మెల్సీ ఓటర్లు 34,132 మంది ఉన్నారు. వీరిలో పట్టభద్రులు 30,593 మంది, ఉపాధ్యాయులు 3,529 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 48 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు, 33 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News February 25, 2025

నిజామాబాద్: విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

image

చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు పశువులను మేపేందుకు తీసుకెళ్లారు. పశువులు చెరువులోకి దిగి పైకి రాకపోవడంతో తండ్రీకొడుకులు వాటిని పైకి వచ్చేలా చేస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు బాదావత్ చిన్న (16) నీట మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2025

నిజామాబాద్: మిర్చికి మాత్రం రూ.25 వేల మ‌ద్దతు ధ‌ర సాధించాలి: కవిత

image

‘ముఖ్య‌మంత్రి ఢిల్లీకి పోతారా.. ప్ర‌ధాని మోదీ కాళ్లు ప‌ట్టుకుంటారా.. ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ క‌చ్చితంగా రూ.25 వేల మ‌ద్దతు ధ‌ర సాధించాల్సిందే’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో కూడా మిర్చి ధ‌ర‌లు త‌గ్గ‌గా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల‌ను క‌లిసి లొల్లి లొల్లి చేశార‌ని గుర్తు చేశారు.

News February 25, 2025

NZB: ‘అధునాతన సదుపాయాలతో రెసిడెన్షియల్ పాఠశాలలు’ 

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తేనున్నామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణ వెల్లడించారు. సోమవారం ఆమె రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు, వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

error: Content is protected !!